బుధవారం 03 జూన్ 2020
National - Apr 08, 2020 , 09:19:03

ట్రాఫిక్‌ పోలీసుకు కరోనా పాజిటివ్‌

ట్రాఫిక్‌ పోలీసుకు కరోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరించింది. దేశం నలుమూలలకు వ్యాపించిన ఈ వైరస్‌తో ఇప్పటి వరకు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదు వేల మందికి పైగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అయితే ఢిల్లీలో పోలీసు విభాగానికి సంబంధించి తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది.

ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసు విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఎస్‌ఐ)కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. గత వారం ఇన్‌స్పెక్టర్‌కు జ్వరం రావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏప్రిల్‌ 7న కరోనా పాజిటివ్‌ అని ఫలితం వచ్చింది. దీంతో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కుటుంబాన్ని వైద్యాధికారులు హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఇక ఈ పోలీసు కుటుంబం నివసించిన కాలనీలో పోలీసులు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌తో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో పడ్డారు ఢిల్లీ పోలీసులు.


logo