గురువారం 03 డిసెంబర్ 2020
National - Oct 20, 2020 , 17:05:50

ఇదేనా మ‌హిళ‌ల‌తో కాంగ్రెస్‌ న‌డుచుకునే తీరు?: స‌్మృతి ఇరానీ

ఇదేనా మ‌హిళ‌ల‌తో కాంగ్రెస్‌ న‌డుచుకునే తీరు?: స‌్మృతి ఇరానీ

న్యూఢిల్లీ: ‌కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు క‌మ‌ల్‌నాథ్ ఐట‌మ్ వ్యాఖ్య‌ల‌పై కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ మండిప‌డ్డారు. సీనియ‌ర్ నాయకుడు అయి ఉండి, ఒక మ‌హిళా నేత‌ను ఐట‌మ్ అని పేర్కొన‌డం చాలా దారుణ‌మ‌న్నారు. ఇప్పుడు క‌మ‌ల్‌నాథ్ చేసిన ఐట‌మ్ వ్యాఖ్యలు మాత్ర‌మే కాద‌ని, కాంగ్రెస్‌లో గ‌తంలో కూడా ఇలాంటివి చాలా జ‌రిగాయ‌ని స్మృతి ఇరానీ విమ‌ర్శించారు. ఇటీవ‌ల ఒక మ‌హిళా కాంగ్రెస్ నాయ‌కురాలిపై సొంత‌పార్టీ కార్య‌క‌ర్త‌లే దాడికి పాల్ప‌డ్డార‌ని ఆమె మండిప‌డ్డారు. 

ఇదేనా కాంగ్రెస్ పార్టీ మ‌హిళ‌ల‌తో వ్య‌వ‌హ‌రించే తీరు అని స్మృతి ఇరానీ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మ‌హిళ‌ల‌తో ఎలా న‌డుచుకుంటుందో చెప్ప‌డానికి ఈ రెండు ఘ‌ట‌న‌లే నిద‌ర్శ‌న‌మ‌ని విమ‌ర్శించారు. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా చోటుచేసుకుంటున్న ఈ ఘ‌ట‌న‌లు కాంగ్రెస్‌లోని అస‌హ్యాన్ని బ‌య‌ట‌పెడుతున్నాయ‌ని ఆమె వ్యాఖ్యానించారు.    ‌   ‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.