వరుసగా ఐదో రోజూ పెరిగిన పెట్రో ధరలు

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఐదోరోజూ పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్‌పై 8 పైసలు, డీజిల్‌పై 18 నుంచి 20 పైసలు పెంచుతూ దేశీయ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.81.59కి, డీజిల్ ధర రూ.71.41కి పెరిగింది. అదేవిధంగా మూడు మెట్రో నగరాల్లో కూడా ధరలు పెరిగనట్లు ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రకటించింది. దీంతో ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.88.29, డీజిల్ ధర రూ.77.90గా ఉన్నది. ఇక చెన్నైలో పెట్రోల్ రూ.84.64, డీజిల్ రూ.76.88, కోల్‌కతాలో పెట్రోల్ రూ.83.15, డీజిల్ రూ.74.98, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.84.86 డీజిల్ రూ.77.93గా ఉన్నాయి.
ఆగస్టు, సెప్టెంబర్ మధ్య పెట్రోల్ ధరలు వరుసగా నెలరోజులపాటు పెరిగాయి. ఈ పరంపర సెప్టెంబర్ 22న నిలిచింది. అదేవిధంగా ఆగస్టు మూడో వారం నుంచి అక్టోబర్ 2 వరకు డీజిల్ ధరలు పెరుగూతూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఆగిన పెట్రో ధరల మంట మళ్లీ గత శుక్రవారం నుంచి ప్రారంభమయ్యింది. వరుసగా నేటివరకు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి.
తాజావార్తలు
- ట్రాక్టర్ తిరగబడి వ్యక్తి మృతి
- 4,54,049 మందికి కోవిడ్ టీకా ఇచ్చేశాం..
- 10 కోట్ల డౌన్లోడ్లు సాధించిన మోజ్
- ఆటా ప్రెసిడెంట్‌గా భువనేశ్ బుజాల బాధ్యతల స్వీకరణ
- ‘రెడ్’ కలెక్షన్స్..రామ్ టార్గెట్ రీచ్ అయ్యాడా..?
- ప్రియుడు చేతిలో యువతి దారుణ హత్య
- ఉపయోగించని బ్యాంకు అకౌంట్లు మూసేయండిలా!
- తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్ని మార్చిన కాళేశ్వరం : సీఎం కేసీఆర్
- ఆస్ట్రేలియా మాజీలకు అదిరిపోయే పంచ్ ఇచ్చిన అశ్విన్
- మరో క్రేజీ ప్రాజెక్టులో పూజాహెగ్డే..?