గురువారం 09 జూలై 2020
National - Jun 15, 2020 , 15:50:40

తమిళనాడులో మరోసారి లాక్‌డౌన్‌

తమిళనాడులో మరోసారి లాక్‌డౌన్‌

చెన్నై : తమిళనాడులో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఉద్ధృతి అధికంగా ఉన్న నాలుగు జిల్లాలో మరోసారి పూర్తిగా లాక్‌డౌన్‌ విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్‌ సోమవారం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు జిల్లాలో ఈనెల 19నుంచి 30 వరకు లాక్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో ఆయా జిల్లాల్లో ఉదయం 6గంటల నుంచి 2గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. 33శాతం ఉద్యోగులతోనే ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తామని తెలిపింది. ప్రజారవాణాను పూర్తిగా నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది. హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. 


logo