శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 09:51:06

మళ్లీ పెరిగిన డీజిల్ ధ‌ర‌..

మళ్లీ పెరిగిన డీజిల్ ధ‌ర‌..

న్యూఢిల్లీ: ఒక‌వైపు క‌రోనా భ‌యం.. మ‌రో వైపు డీజిల్ బాదుడుతో సామాన్యులు హ‌డ‌లిపోతున్నారు. దేశవ్యాప్తంగా డీజిల్ ధ‌ర‌లు ప్ర‌తిరోజు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్ ధ‌ర‌ కంటే డీజిల్ ధ‌ర‌ ఎక్కువవుతుండ‌టంతో వాహ‌న‌దారులు బెంబేలెత్తుతున్నారు. రోజువారీ స‌మీక్ష‌లో భాగంగా పెట్రోల్ ధ‌ర‌ల‌ను స్థిరంగా ఉంచిన చ‌మురు కంపెనీలు, డీజిల్ ధ‌ర‌ను 12 పైస‌లు పెంచాయి. దీంతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ డీజిల్ ధ‌ర 81.64కు చేరింది. పెట్రో ధ‌ర‌లు య‌ధాత‌థంగా ఉండ‌టంతో ప్ర‌స్తుతం లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.8043గా ఉన్న‌ది. అంటే పెట్రోల్ కంటే డీజిల్ ధ‌ర రూ.1.21 ఎక్కువ‌. 

జూన్ 7 నుంచి వ‌రుస‌గా 22 రోజుల‌పాటు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి. అయితే జూన్ 29 నుంచి పెట్రోల్ ధ‌ర‌ను మార్చ‌కుగా, డీజిల్ ధ‌ర‌ను మాత్రమే చ‌మురు కంపెనీలు పెంచాయి. మ‌ళ్లీ గ‌త ఐదు రోజుల నుంచి వ‌రుస‌గా డీజిల్ ధ‌ర‌లు పెరుగుతూ వ‌స్తున్నాయి.  

తాజావార్తలు


logo