ఇవాళ ఒక్కరోజే 3.7 కోట్ల మంది పుడుతున్నారట!

న్యూఢిల్లీ : జనవరి ఒకటో తేదీ అందరికీ స్పెషల్. మరి ఆ రోజు జన్మించిన పిల్లలకు ఇంకా స్పెషల్. ఎందుకంటే కొత్త ఏడాది రోజున పుట్టామని గర్వంగా చెప్పుకుంటారు. ఆ రోజున డెలివరీ అయ్యేందుకు చాలా మంది గర్భిణిలు ఇష్టపడుతుంటారు. ఆ సమయానికి సాధారణ కాన్పు జరగకపోయినప్పటికీ, సీజేరియన్ చేసుకునేందుకు ఇష్టపడే మహిళలు అధిక సంఖ్యలో ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆరోజే పిల్లల్ని కనాలనే లక్ష్యంతో కూడా భార్యాభర్తలు ప్లానింగ్ చేసుకున్న సందర్భాలు కూడా చూస్తూనే ఉంటాం.. కొత్త ఏడాదికి అంత స్పెషల్ ఉంటుంది మరి.
2021, జనవరి 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 3.7 కోట్ల మంది జన్మించనున్నట్లు యునిసెఫ్ ప్రకటించింది. భారతదేశంలో అయితే 60 వేల మంది శిశువులు పుట్టే అవకాశం ఉందని తెలిపింది. 2021 ఏడాదిలో ఫిజి దేశం తొలి బిడ్డకు స్వాగతం పలికే అవకాశం ఉందని, చివరగా అమెరికా ఉండొచ్చని పేర్కొంది.
ప్రపంచ వ్యాప్తంగా పది దేశాలను చూస్తే.. ఇండియాలో 59,995 మంది శిశువులు, చైనాలో 35,615, నైజీరియాలో 21,439, పాకిస్తాన్లో 14,161, ఇండోనేషియాలో 12,336, ఇథియోపియాలో 12,006, అమెరికాలో 10,312, ఈజిప్టులో 9,455, బంగ్లాదేశ్‌లో 9,236, కాంగోలో 8,640 మంది శిశువులు జన్మించనున్నారని తెలిపింది.
ఇక 2021లో మొత్తంగా 140 మిలియన్ల పిల్లలు పుట్టే అవకాశం ఉందని యునిసెఫ్ అంచనా వేసింది. వారి సగటు జీవిత కాలం 84 సంవత్సరాలు ఉండొచ్చు అని తెలిపింది. ఇండియాలో మాత్రం 80 సంవత్సరాలే అని పేర్కొంది.
తాజావార్తలు
- పాతబస్తీలో పేలిన సిలిండర్.. 13 మందికి గాయాలు
- అరుణాచల్‌ప్రదేశ్ మాజీ గవర్నర్ కన్నుమూత
- ఈ రాశులవారికి.. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..