ఆదివారం 17 జనవరి 2021
National - Jan 14, 2021 , 21:51:51

‘26న ఎర్రకోట వద్ద చారిత్రాత్మక దృశ్యం’

‘26న ఎర్రకోట వద్ద చారిత్రాత్మక దృశ్యం’

న్యూఢిల్లీ: జనవరి 26న ఎర్రకోట వద్ద చారిత్రాత్మక దృశ్యం కళ్లకు కడుతుందని రైతు సంఘం నేతలు తెలిపారు. తమ ప్రణాళిక ప్రకారం ఆ రోజు ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ఇండియా గేట్‌ వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తామని భారత కిసాన్‌ యూనియన్‌ ప్రతినిధి రాకేశ్‌ తికాయత్‌ తెలిపారు. అమర్ జవాన్ జ్యోతి వద్ద రైతులంతా కలిసి జెండాను ఎగురవేస్తారని చెప్పారు. ఒక వైపు రైతులు.. మరోవైపు జవాన్లు.. ఇది ఒక చారిత్రాత్మక దృశ్యం అవుతుందని అన్నారు. 


మరోవైపు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం జరిపే చర్చల్లో పాల్గొంటామని క్రాంతికారి కిసాన్ యూనియన్ చీఫ్ దర్శన్ పాల్ తెలిపారు. ప్రభుత్వం స్పందన ఆధారంగా తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని చెప్పారు. వ్యవసాయ చట్టాలను సమీక్షించడానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి ఒక సభ్యుడు రాజీనామా చేశారని, ఇది మంచి పరిణామమని ఆయన అన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.