ఆదివారం 05 జూలై 2020
National - Jun 22, 2020 , 14:56:29

కేంద్రానికి మద్దతు : మాయావతి

కేంద్రానికి మద్దతు : మాయావతి

న్యూఢిల్లీ : ఇండియా, చైనా మధ్య గాల్వాన్‌ లోయలో జరుగుతున్న సరిహద్దు ప్రతిష్టంభనపై కేంద్రానికి బహుజన సమాజ్‌ పార్టీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. పూర్తి పరిపక్వత, సంఘీభావంతో పని చేయాలని అటు కేంద్రానికి, ఇటు ప్రతిపక్షాలకు ట్విట్టర్‌ వేదికగా సూచించారు. గత సోమవారం 20 మంది భారత ఆర్మీ సైనికులు మృతి చెందిన తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణపై పలు ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ కేంద్రంపై ఒత్తిడి పెంచగా మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు.

సరిహద్దు ఘర్షణలో ఓ కల్నల్ సహా 20 మంది భారత ఆర్మీ సైనికులు మృతి చెందడంతో దేశం మొత్తం విచారం, ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ‘ప్రభుత్వం, ప్రతిపక్షాలు రెండూ పూర్తి పరిపక్వతతో సంఘీభావంతో చేయాలని, అప్పుడే దేశానికి, ప్రపంచానికి సమర్థవంతమైందిగా నిరూపించబడుతుందని’ హిందీలో ట్వీట్ చేశారు. ఇలాంటి క్లిష్టమైన సమయంలో ప్రభుత్వం తదుపరి చర్యలపై ప్రజలు, నిపుణుల అభిప్రాయం భిన్నంగా ఉంటుందనీ, సరిహద్దును రక్షించడానికి ప్రభుత్వానికి వదిలివేయడమే మంచిదని సూచించారు. 


logo