ట్రబుల్ షూటర్ రాజ్నాథ్ రంగ ప్రవేశం ఫలిస్తుందా?

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలతో సోమవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చర్చలు జరుపనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
రైతుల ఆందోళనను విరమింప జేయడానికి గల అన్ని రకాల ఆప్షన్లపైనా రక్షణ మంత్రి రాజ్నాథ్తో తోమర్ చర్చించారని అధికార వర్గాల కథనం. రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య ప్రతిష్ఠంభనకు తెర దించడానికి మధ్యేమార్గాన్ని అనుసరించనున్నట్లు సమాచారం. అటల్ బీహారీ వాజపేయి హయాంలో రాజ్నాథ్ సింగ్ వ్యవసాయ మంత్రిగా పని చేశారు.
ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనను విరమింప చేయడానికి రాజ్నాథ్ ట్రబుల్ షూటర్ గా మారారు. ఇప్పటికే 39 రోజులుగా ఆందోళన సాగిస్తున్న రైతులు తమ నిరసనను ఉధృతం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఎముకలు కొరికే చలిలోనూ, వర్షాలు కురుస్తున్నా రైతులు ఆందోళన నుంచి వెనుకడుగు వేయకపోవడం గమనార్హం.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతోపాటు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి హామీనిస్తూ నూతన చట్టం చేయాలన్న డిమాండ్లను కేంద్రం ఆమోదించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. రైతుల ఆందోళన పరిష్కారం అవుతుందని చెప్పడానికి తాను జ్యోతిష్కుడిని కాదని తోమర్ మీడియాకు చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఐటీ అభివృద్ధికి బ్లూప్రింట్
- క్షిపణి సాంకేతికతలో ఆత్మ నిర్భరత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- అవార్డుతెచ్చిన ‘అమ్మమ్మ’ ఆవిష్కరణ
- 20.41 కోట్లతో దివ్యాంగులకు ఉపకరణాలు
- వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల ఆదేశం
- ప్లాస్మా పొడితో ప్రతిరక్షకాలు
- 20 వేల ప్రైవేట్ వైద్యసిబ్బందికి టీకా
- ఏపీ ‘పంచాయతీ’కి సుప్రీం ఓకే
- సత్యలోకం కోసం బలి!
- 8 ఎకరాల్లో పీవీ విజ్ఞానవేదిక