సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 03, 2020 , 02:19:29

డ్యూటీకి ప్రాధాన్యం..బాబును ఎత్తుకొని విధులు

డ్యూటీకి ప్రాధాన్యం..బాబును ఎత్తుకొని విధులు

నోయిడా: ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళా కానిస్టేబుల్‌ ఏడాదిన్నర వయసున్న కుమారుడ్ని ఎత్తుకొని విధులు నిర్వర్తించడం అందరినీ ఆకట్టుకున్నది. నోయిడాలో సోమవారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పర్యటిస్తున్న సందర్భంగా విధుల్లో ఉన్న ప్రీతిరాణి తన బాబును ఎత్తుకొనే డ్యూటీ చేశారు. ‘నా భర్త ఈరోజు పరీక్ష రాసేందుకు వెళ్లారు. అందువల్ల నా కొడుకు బాధ్యతను నేను స్వయంగా చూసుకోవాల్సి వచ్చింది. డ్యూటీ కూడా ముఖ్యమే. అందుకే నా బాబును తీసుకొచ్చాను’ అని ప్రీతి చెప్పారు. గౌతమ్‌ బద్ధ్‌ నగర్‌ జిల్లాలో ఆది, సోమవారాల్లో పర్యటించిన సీఎం యోగి వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 

logo