బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 11:23:23

మొన్న ప‌సిబిడ్డ‌.. నేడు చైన్ స్నాచింగ్‌.. దేశ రాజ‌ధానిలో భద్ర‌త‌కు క‌రువైంది!

మొన్న ప‌సిబిడ్డ‌.. నేడు చైన్ స్నాచింగ్‌.. దేశ రాజ‌ధానిలో భద్ర‌త‌కు క‌రువైంది!

క‌రోనా టైంలో కూడా దొంగ‌త‌నాలు జ‌రుగుతున్నాయంటే ఏమ‌నుకోవాలి. ఎక్క‌డ రోగం అంటుకుంటుందో అన్న భ‌యం కూడా లేకుండా ఇలా దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్నారు. ఇద్ద‌రు మ‌హిళ‌లు రోడ్డు మీద న‌డుచుకుంటూ వెళ్తున్న త‌రుణంలో ఇద్ద‌రు పురుషులు బైక్ మీద వ‌చ్చి ఒక మ‌హిళ మెడ‌లో చైన్ లాక్కెళ్లాల‌నుకున్నారు. ప‌ట్టుకున్న వెంట‌నే చేతికి అంద‌క‌పోవ‌డంతో బైక్ దిగి మ‌రీ ఆమెను ప‌ట్టుకొని చైన్ లాక్కునే ప్ర‌య‌త్నం చేశాడు బైక్ మీద వెనుక కూర్చున్న వ్య‌క్తి.

ఆ మ‌హిళ‌తోపాటు ఉన్న మ‌రో మ‌హిళ భ‌యంతో ప‌రుగులు తీసింది. అటుగా వెళ్తున్న ఓ డెలివ‌రీ బాయ్ హెల్మెట్‌తో ఆ దుండ‌గుల‌ను కొట్టేందుకు ప్ర‌య‌త్నించాడు. అయినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. ఈ సంఘ‌ట‌న అంతా రోడ్డు ప‌క్క‌నే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కావ‌డంతో సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఇది వైర‌ల్‌గా మారింది. ఈ సంఘ‌ట‌న మ‌రెక్క‌డో కాదు మ‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలోనే. మొన్న‌టికి మొన్న నాలుగేండ్ల బాబుని అప‌హ‌రించాల‌నుకున్న వారికి ఆ త‌ల్లి బుద్ది చెప్పిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఈ సంఘ‌ట‌న‌. logo