బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 18:32:48

భూమిపూజకు ప్రతిపక్ష నేతలను అందుకే ఆహ్వానించలేదు: యోగి

భూమిపూజకు ప్రతిపక్ష నేతలను అందుకే ఆహ్వానించలేదు: యోగి

లక్నో: అయోధ్యలో బుధవారం జరిగిన  భూమిపూజకు ప్రతిపక్ష పార్టీల నేతలను ఆహ్వానించకపోవడం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చెప్పారు. కరోనా నిబంధనల మేరకు సుమారు 200 మంది మాత్రమే దీనికి హాజరయ్యారని, బీజేపీ అధ్యక్షుడ్నికూడా పిలువలేదని ఆయన తెలిపారు. రామమందిర నిర్మాణ్నాన్ని త్వరగా  ప్రారంభించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని యోగి అన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై తమ విధానం ఎప్పుడూ మారలేదని ఆయన చెప్పారు. బుధవారం భూమిపూజ సందర్భంగా సెంటిమెంట్‌ను ఒలకబోసిన కాంగ్రెస్‌, విపక్ష పార్టీలు రామమందిరం గురించి తమ విధానాన్ని ఎప్పుడైనా స్పష్టం చేశాయా అని ప్రశ్నించారు.

అయోధ్యలో భవ్య రామమందిరాన్ని నిర్మించాలని 1984 నుంచే తాము సంకల్పించామని యోగి చెప్పారు. 1949, 1984, 1989, 1990, 1992న జరిగిన పరిణామాలతో రామ మందిరం నిర్మాణంపై ప్రతిపక్ష పార్టీల వైఖరి, సెంటిమెంట్‌ ఏమిటన్నది దేశ ప్రజలకు తెలిసిపోయిందన్నారు. కాగా, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శుంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీరాముడి విగ్రహాన్ని యోగి ఆదిత్యనాథ్‌ బహూకరించారు. logo