గురువారం 09 జూలై 2020
National - Jun 16, 2020 , 10:44:31

పదోరోజూ పెట్రో ధరల షాక్‌!

పదోరోజూ పెట్రో ధరల షాక్‌!

న్యూఢిల్లీ: పదోరోజూ పెట్రో ధరలు వినియోగదారులకు షాక్‌ ఇచ్చాయి. రేట్ల పెంపు మంగళవారం కూడా కొనసాగింది. తాజాగా పెట్రోలుపై 40-47 పైసలు, డీజిల్ పై 48-57 పైసలు పెంచారు. ఈ 10 రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 5.45 , డీజిల్ ధర లీటరుకు రూ. 5.8  (ఢిల్లీ రేట్లు) పెరిగింది.  దీంతో  పెట్రోలు ,డీజిల్ ధరలు ఈ  ఏడాది గరిష్టానికి  చేరాయి. దీంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.  


ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ ధరలు(లీ) 

న్యూఢిల్లీ : పెట్రోలు ధర  రూ. 76.73, డీజిల్  రూ.75.19

ముంబై :  పెట్రోలు ధర  రూ. 83.62, డీజిల్  రూ.73.75

చెన్నై: పెట్రోలు ధర  రూ. 80.37, డీజిల్  రూ.73.17

హైదరాబాద్ : పెట్రోలు ధర  రూ.79.65, డీజిల్  రూ.73.49

 logo