శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 10, 2020 , 14:57:47

సుప్రీంను ఆశ్ర‌యించిన ఒమ‌ర్ అబ్దుల్లా సోద‌రి

సుప్రీంను ఆశ్ర‌యించిన ఒమ‌ర్ అబ్దుల్లా సోద‌రి

హైద‌రాబాద్‌:  జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎం ఒమ‌ర్ అబ్దుల్లాను.. ప్ర‌జా భ‌ద్ర‌తా చ‌ట్టం కింద నిర్బంధంలోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఇవాళ ఒమ‌ర్ అబ్దుల్లా సోద‌రి సారా పైల‌ట్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ప‌బ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద ఒమ‌ర్‌ను ఎలా నిర్బంధిస్తార‌ని ఆమె పిటిష‌న్ వేశారు.  సీనియ‌ర్ న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్‌.. ఈ కేసును డీల్ చేస్తున్నారు. జ‌స్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ నేతృత్వంలోని ధ‌ర్మాసనం ఈ కేసును విచారించ‌నున్న‌ది. హెబియ‌స్ కార్ప‌స్ పిటిష‌న్ దాఖ‌లు చేసిన‌ట్లు సిబ‌ల్ చెప్పారు. ఈ వారంలోనే ఈ కేసును విచారించాల‌ని ఆయన కోర్టును కోరారు.  బెంచ్ కూడా దీనికి అంగీక‌రించింది. గ‌త ఏడాది క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసిన నేప‌థ్యంలో ప‌లువురు నేత‌ల‌ను హౌజ్ అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.



logo