బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 24, 2020 , 11:55:21

ఒమ‌ర్ అబ్దుల్లా రిలీజ్‌..

ఒమ‌ర్ అబ్దుల్లా రిలీజ్‌..
హైద‌రాబాద్‌: జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా ఇవాళ గృహ నిర్బంధం నుంచి విముక్తి పొందారు.  దాదాపు 8 నెల‌ల నిర్బంధం త‌ర్వాత ఆయ‌న రిలీజ్ అయ్యారు. ప్ర‌జా భ‌ద్ర‌తా చ‌ట్టం కింద ఆయ‌న్ను అరెస్టు చేశారు.  గ‌త ఏడాది క‌శ్మీర్‌లో ఆర్టికిల్ 370ని ఎత్తివేశారు. ఆ నేప‌థ్యంలో కొంద‌రు క‌శ్మీరీ నేత‌ల‌ను హౌజ్ అరెస్టు చేశారు. ఆ జాబితాలో ఒమ‌ర్ కూడా ఉన్నారు. ఇటీవ‌లే ఒమ‌ర్ తండ్రి ఫారూక్ అబ్దుల్లాను కూడా ఏడు నెల‌ల నిర్బంధం త‌ర్వాత విడుద‌ల చేసిన విషయం తెలిసిందే.  ఒమ‌ర్ అబ్దుల్లా గృహ నిర్బంధంలో సుమారు 232 రోజులు గ‌డిపారు. logo