గురువారం 03 డిసెంబర్ 2020
National - Nov 17, 2020 , 18:34:55

అమిత్‌షాపై ఒమ‌ర్, మెహ‌బూబా అగ్ర‌హం

అమిత్‌షాపై ఒమ‌ర్, మెహ‌బూబా అగ్ర‌హం

శ్రీన‌గ‌ర్‌: రాజ‌కీయ‌ పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేయడం కూడా జాతి వ్యతిరేకమేనా..? అని జమ్ము-కశ్మీర్‌ నేతలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. జమ్ము-కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడటంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమ‌ర్శ‌లు చేశారు. వారి కూట‌మి అప‌విత్ర కూట‌మి అని వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో వారు అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. 

బీజేపీ అధికార దాహంతో ఎన్ని పార్టీలతోనైనా పొత్తు పెట్టుకోవచ్చా అని నిలదీశారు. అమిత్ షా ట్విట్ట‌ర్‌లో కాంగ్రెస్, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలపై విరుచుకుపడ్డారు. గుప్కార్‌ గ్యాంగ్ జమ్ము-కశ్మీర్‌ను తిరిగి ఉగ్రవాదం, సంక్షోభాల యుగానికి తీసుకెళ్ళాలనుకుంటోందని దుయ్యబట్టారు. అందుకే వారిని ప్రజలు అన్నిచోట్ల‌ తిరస్కరిస్తున్నారని వ్యాఖ్యానించారు.