శనివారం 06 జూన్ 2020
National - May 12, 2020 , 16:39:02

ఫ్లోరెన్స్ నైటింగేల్‌కు ఘ‌న నివాళి

ఫ్లోరెన్స్ నైటింగేల్‌కు ఘ‌న నివాళి

చెన్నై: అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని త‌మిళ‌నాడు రాష్ట్రం చెన్నైలోని ఒమండురార్ మెడిక‌ల్ కాలేజీకి చెందిన న‌ర్సులు ఫ్లోరెన్స్ నైటింగేల్‌కు ఘ‌నంగా నివాళులు అ‌ర్పించారు. ఆమె చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి అంజ‌లి ఘ‌టించారు. క్యాండిల్స్ వెలిగించి ‌సంతాపం తెలిపారు. ఈ సంద‌ర్భంగా త‌మిళ‌నాడు ఆరోగ్య‌శాఖ మంత్రి సీ విజ‌య‌భాస్క‌ర్ కూడా ఆస్ప‌త్రిని సంద‌ర్శించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్ర‌ప‌టానికి పుష్పాంజ‌‌లి ఘ‌టించారు. క‌రోనా మ‌హ‌మ్మారిపై ముందుండి పోరాడుతున్న న‌ర్సులంద‌రికీ ఈ సంద‌ర్భంగా మంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఆధునిక న‌ర్సిగ్ వ్య‌వ‌స్థ  ‌స్థాప‌కురాలు, సంఘ సంస్క‌ర్త ఫ్లోరెన్స్ నైటింగేల్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ప్ర‌తి ఏటా మే 12న అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం జ‌రుపుకుంటున్నాం.   


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..

 


logo