శనివారం 28 నవంబర్ 2020
National - Nov 10, 2020 , 19:44:47

మళ్లీ ఓడిన ఒలింపియన్ రెజ్లర్ యోగేశ్వర్ దత్

మళ్లీ ఓడిన ఒలింపియన్ రెజ్లర్ యోగేశ్వర్ దత్

న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతుల పక్షాన ఆందోళనకు దిగిన కాంగ్రెస్‌ పంజాబ్‌లో బీజేపీని చిత్తు చేసింది. రైతు ఆందోళన తరువాత జరిగిన బరోడా ఉప ఎన్నికల్లో హర్యానాలో కాంగ్రెస్ గణనీయమైన విజయాన్ని సాధించింది. హర్యానా సోనిపట్ జిల్లాలోని జాట్ ఆధిపత్య నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇందూ రాజ్ నార్వాల్ బీజేపీకి చెందిన ఒలింపియన్ రెజ్లర్ యోగేశ్వర్ దత్‌ను ఓడించారు. 2019 అక్టోబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ క్రిషన్ హుడా చేతిలో యోగేశ్వర్‌ దత్‌ ఘోరపరాజం పాలయ్యారు. ఇక్కడ శ్రీకిషన్‌ హుడా ఆకస్మికంగా చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు యోగేశ్వర్‌ దత్‌ బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి మరోసారి ఓటమిపాలయ్యారు. 

హర్యానా బీజేపీ అధ్యక్షుడు ఓం ప్రకాష్ ధంకర్ ఓటమిని అంగీకరిస్తూ "బరోడా సీటు అంతకుముందు కాంగ్రెస్ వద్ద ఉంది. మేము ఈ అవకాశాన్ని సవాలుగా మార్చలేకపోయాం. ఈ స్థానాన్ని తిరిగి కాంగ్రెస్‌ నిలబెట్టుకున్నది” అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ బలంగా ఉన్న సీటును గ్రాండ్ ఓల్డ్ పార్టీ నుంచి దక్కించుకునే ప్రయత్నంలో బీజేపీకి దాని మిత్రపక్షమైన జానాయక్ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం గత కొన్ని నెలల్లో అసెంబ్లీ విభాగానికి రూ.200-300 కోట్ల అభివృద్ధి పనులు చేపడతామని వాగ్దానం చేసిందని, అసెంబ్లీ విభాగానికి ఒక విశ్వవిద్యాలయం, పారిశ్రామిక మోడల్ టౌన్‌షిప్, రెండు కళాశాలలను ఆమోదించిందని బీజేపీ హామీ ఇచ్చింది. అయినప్పటికీ బీజేపీ అభ్యర్థికి ప్రజలు ఆదరించలేదు. 2012 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన యోగేశ్వర్‌ దత్.. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీజేపీలో చేరారు. కాంగ్రెస్ ప్రచారానికి మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, ఆయన కుమారుడు, మాజీ ఎంపీ దీపేందర్ సింగ్ హుడాతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కుమారి సెల్జా నాయకత్వం వహించారు.