ఆదివారం 12 జూలై 2020
National - Jun 24, 2020 , 18:59:48

ప‌క్షుల‌తో ఆడుకుంటున్న‌ ఏనుగు!

ప‌క్షుల‌తో ఆడుకుంటున్న‌ ఏనుగు!

చిన్న‌ప్పుడు చాలా ఆట‌లు ఆడి ఉంటారు కాని ప‌క్షులు, సీతాకోక‌చిలుక‌తో ఆడుకున్నారా? అస‌లు ఆడి ఉండ‌రు క‌దా. ఈ చిన్న ఏనుగు మాత్రం ప్రకృతిని  ఆస్వాదిస్తూ ప‌క్షుల‌తో ఆనందంగా ఆడుకుంటున్న‌ది. ఇది పాత వీడియో అయిన‌ప్ప‌టికీ ఇండియ‌న్ ఫారెస్ట్ అధికారి ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఇప్పుడు ఇది బాగా వైర‌ల్ అవుతున్న‌ది.

ఏనుగులు చాలా సున్నితంగా ఉంటాయి. ఇవి మోస‌పోవ‌డ‌మే కాని మోసం చేయ‌డం తెలియ‌దు. ఇవి చేసే అల్ల‌ర్ల వీడియోల‌తో ట్విట‌ర్ నిండి ఉంటుంది. 'ప‌క్షుల‌ను వెంటాడ‌టం, సీతాకోకచిలుక‌ల‌తో ఆడుకోవ‌డం. చిన్న‌ప్పుడు ఎవ‌రూ చేసి ఉండ‌రు' అనే శీర్షిక‌తో నంద షేర్ చేశారు. 40 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియో అంద‌రికీ ఉత్సాహాన్నిస్తుంది. చిన్న‌పిల్ల‌లా ఎంత బాగా ఆడుకుంటుందో అని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.


  


logo