బుధవారం 03 జూన్ 2020
National - May 20, 2020 , 15:25:11

'ఓలా'లో ఉద్యోగాల కోత

 'ఓలా'లో  ఉద్యోగాల కోత

న్యూఢిల్లీ: క‌రోనా లాక్​డౌన్​తో సంక్షోభ‌ పరిస్థితులను ఎదుర్కొంటున్న కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.  తాజాగా ప్రముఖ ఆన్‌లైన్‌ క్యాబ్ సేవల సంస్థ 'ఓలా'  ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయించింది. ఓలా రైడ్స్‌, ఫైనాన్షియల్‌ సేవలు, ఫుడ్‌ బిజినెస్‌ విభాగాల నుంచి 1,400 మంది స్టాఫ్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా   రెండు నెలల్లో ఓలా ఆదాయంలో 95 శాతం పడిపోయిందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో   భవీష్ అగర్వాల్ కంపెనీ ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో తెలిపారు. భారత్‌లో నాలుగో దశ లాక్‌డౌన్‌ అమలవుతున్న సమయంలో  ఓలా ఈ నిర్ణయం తీసుకుంది.

నోటీసు పీరియడ్‌తో సంబంధం లేకుండా బాధిత ఉద్యోగులకు ఓలా కనీసం మూడు నెలల జీతం ఇవ్వనుంది.  కర్ణాటక ప్రభుత్వం అనుమతించడంతో బెంగళూరు, మైసూరు, మంగళూరు తదితర ప్రాంతాల్లో ఓలా క్యాబ్‌ సర్వీసులను ప్రారంభించింది. మరో క్యాబ్‌ సేవల సంస్థ ఉబెర్‌ కూడా కొంతమంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. 


logo