శనివారం 30 మే 2020
National - May 12, 2020 , 17:18:35

వేల లీట‌ర్ల వంటనూనె నేల‌పాలు!

 వేల లీట‌ర్ల వంటనూనె నేల‌పాలు!

చెన్నై: తమిళనాడులో రిఫైండ్ ఆయిల్‌తో వెళ్తున్న‌ ఓ ట్యాంకర్‌ ప్రమాదానికి గురైంది. దీంతో వేల లీటర్ల రిఫైండ్‌‌ ఆయిల్ రోడ్డుపాలైంది. చెన్నై నుంచి సేలం జిల్లా అత్తూర్‌కు ఆయిల్‌ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ కామరాజనగర్‌లో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయిల్‌ ట్యాంక్‌ పగిలిపోయింది. దీంతో ట్యాంక‌ర్‌లోని రెండు ట‌న్నుల‌కు పైగా ఆయిల్ వృథాగా పోయింది. ధార‌లుగా కారిపోతున్న వంట‌నూనెను కామ‌రాజ‌న‌గ‌ర్ వాసులు గిన్నెలు, బిందెలతో పట్టుకునేందుకు పోటీపడ్డారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo