ఆదివారం 05 జూలై 2020
National - Jun 16, 2020 , 15:07:30

రూ.2 లక్షలు లంచం..అధికారిని పట్టించిన సర్పంచ్‌

రూ.2 లక్షలు లంచం..అధికారిని పట్టించిన సర్పంచ్‌

మధ్యప్రదేశ్‌: ప్రభుత్వ నిధుల విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారి అవినీతికి పాల్పడ్డాడు. జన్‌పద్‌ పంచాయతీ ఉన్నతాధికారి సర్పంచ్‌ దగ్గర లంచం డిమాండ్‌ చేసి అడ్డంగా బుక్కయిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని నివారీ జిల్లాలో వెలుగుచూసింది. వివరాళ్లోకి వెళితే..హర్షకుమార్‌ ఖరే అనే వ్యక్తి నివారి జనపద్‌ పంచాయతీలో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గా పనిచేస్తున్నాడు.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద జరిగిన పనుల నిధులకు సంబంధించి ఫిర్యాదులను పరిష్కరించాల్సిందిగా..హర్షకుమార్‌ ఖరేను టెహెర్కా గ్రామ సర్పంచ్‌ గయాడీన్‌ అహిర్వాల్‌ కోరారు. అయితే సమస్యను పరిష్కరించాలంటే తనకు రూ.4 లక్షలు లంచం ఇవ్వాలని సర్పంచ్‌ను హర్షకుమార్‌ డిమాండ్‌ చేశారు. దీంతో సర్పంచ్‌ లోకాయుక్త స్పెషల్‌ పోలీసుల (ఎస్పీఈ)ను ఆశ్రయించాడు. హర్షకుమార్‌ కార్యాలయంలో రూ.2లక్షలు తీసుకుంటుండగా పోలీసులు అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్పీఈ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. logo