మంగళవారం 14 జూలై 2020
National - May 27, 2020 , 15:18:23

అత్యంత వేడి ప్రదేశాలు ఏవో తెలుసా?

అత్యంత వేడి ప్రదేశాలు ఏవో తెలుసా?

న్యూఢిల్లీ: రోహిణి కార్తెకు రోళ్లు పగిలేంత ఎండ కాస్తుందని నానుడి ఉండనే ఉన్నది. రోళ్లే కాదు కొండలు, గుట్టలు పగిలిపోయేంత ఎండలు ప్రస్తుతం ముక్కుతిప్పలు పెడుతున్నాయి. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కూడా ఎండలు మండిపోతున్నాయంట. ఇంతకీ అత్యంత వేడి ప్రదేశాలు 15 ఉండగా.. అందులో 10 మన దేశంలోనే ఉండగా.. మిగతావి పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో ఉండటం విశేషం. అవేంటో ఓ లుక్కేద్దాం.

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని చురూ అత్యంత వేడి ప్రదేశంగా రికార్డులకెక్కింది. ఇక్కడ మంగళవారం నాడు 50 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. చురూతో సమానంగా పాకిస్థాన్‌లోని జకోబాబాద్‌లో కూడా ఇదే మాదిరి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్థాన్‌ రాష్ట్రం నుంచే బికనేర్‌, గంగానగర్‌, పిలనిలు కూడా వేడి ప్రదేశాల జాబితాలో ఉన్నాయి. రెండు చొప్పున నగరాలు ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర నుంచి జాబితాలో చేరాయి. ఉత్తరప్రదేశ్‌లోని బందా, హర్యానాలోని హిస్సార్‌లో రికార్డు స్థాయిలో నిన్న 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అతర్వాతి స్థానాల్లో న్యూఢిల్లీ (47.6), బికనేర్‌ (47.4), గంగానగర్‌ (47), ఝాన్సీ (47), పిలనీ (46.9), నాగ్‌పూర్‌ సోనేగావ్‌ (46.8), అకోలా (46.5 డిగ్రీలు) ఉన్నాయి. 

రాజస్థాన్‌లోని చురూలో పదేండ్ల క్రితం నాటి ఉష్ణోగ్రతలు మంగళవారం నమోదయ్యాయి. 2016 మే 19 న 50.2 డిగ్రీల సెల్సియస్‌ కనిపించగా.. మళ్లీ మే 26న 50 డిగ్రీలు నమోదయ్యాయి. 


logo