సోమవారం 13 జూలై 2020
National - Jun 15, 2020 , 14:13:24

పెన్షన్‌ కోసం వృద్ధురాలిని మంచంపై లాక్కెళ్లారు

పెన్షన్‌ కోసం వృద్ధురాలిని మంచంపై లాక్కెళ్లారు

భువనేశ్వర్‌: పెన్షన్‌ కోసం వందేడ్ల వృద్ధురాలు పడరాని పాట్లు పడింది. ఆమెను తీసుకొస్తేగాని పెన్షన్‌ డబ్బులు ఇవ్వబోమని బ్యాంకు అధికారులు కుమార్తెకు చెప్పారు. అయితే వృద్ధురాలైన ఆమె తల్లి మంచం నుంచి లేవలేని పరిస్థితి. దీంతో ఏం చేయాలో తెలియని పెద్ద కూతురు, తల్లి ఉన్న మంచాన్ని బ్యాంకు వరకు ఈడ్చుకెళ్లింది. ఒడిశాలోని నుపాడా జిల్లాలో ఇటీవల జరిగిన ఈ హృదయ విదారకర ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అయితే వృద్ధురాలిని, ఆమె కుమార్తెను ఇంత ఇబ్బంది పెట్టిన బ్యాంకు అధికారులను ఏమీ అనలేని విపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కరోనా నేపథ్యంలో నిరు పేదలు ఇలాంటి కష్టాలెన్నో అనుభవిస్తున్నారనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తున్నది. logo