ఆదివారం 05 జూలై 2020
National - Jun 16, 2020 , 09:33:16

క‌రోనా చెకింగ్‌.. ఒడిశాలో ఇంటింటి స‌ర్వే

క‌రోనా చెకింగ్‌.. ఒడిశాలో ఇంటింటి స‌ర్వే

హైద‌రాబాద్‌: ఒడిశా ప్ర‌భుత్వం కోవిడ్ కేసుల నిర్ధార‌ణ కోసం ఇంటింటి స‌ర్వే చేప‌ట్ట‌నున్న‌ది. 45 రోజులు పాటు డోర్ టూ డోర్ స‌ర్వే చేప‌ట్ట‌నున్న‌ట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. జూన్ 16వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వ‌ర‌కు ప్ర‌తి ఇంటికి.. ఆశా, ఏఎన్ఎం వ‌ర్క‌ర్లు వెళ్లి స‌మాచారం సేక‌రించ‌నున్నారు. గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోనూ స‌ర్వే చేప‌డుతారు.  కోవిడ్‌19 ల‌క్ష‌ణాలు ఉన్న వారి డేటాను సేక‌రించ‌నున్న‌ట్లు ఒడిశా నేష‌ణ‌ల్ హెల్త్ మిష‌న్ డైర‌క్ట‌ర్ శాలినీ పండిట్ తెలిపారు.  


logo