బుధవారం 23 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 13:57:10

ఒడిశాలో నేడు అత్యధిక కరోనా మరణాలు నమోదు

ఒడిశాలో నేడు అత్యధిక కరోనా మరణాలు నమోదు

భువనేశ్వర్ : ఒడిశా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,528 కరోనా కేసులు నమోదు కాగా, 14 మంది వ్యాధి బారిన పడి మృతిచెందారని రాష్ట్ర ఆరోగ్య శాఖ సోమవారం తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒకే రోజు 14 మంది మృతిచెందడం ఇదే మొదటిసారి. గంజాంలో ఆరుగురు మరణించగా, ఖుర్దా, నాయగర్‌ జిల్లాల్లో ముగ్గురు, రాయగడ్‌, సుందర్‌నగర్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. 

దీంతో మొత్తం మరణాల సంఖ్య 286కు చేరింది. సోమవారం కొత్తగా 1,528 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 47,455కు చేరింది. గంజాం జిల్లాలో అత్యధికంగా 233 కేసులు నమోదయ్యాయి. 15,334 మంది ప్రస్తుతం దవాఖానల్లో చికిత్స పొందుతుండగా ఇప్పటివరకు 31,784 మంది వ్యాధి బారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo