శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 14:17:39

ఒడిశాలో 20వేలకు చేరువలో కరోనా కేసులు

ఒడిశాలో 20వేలకు చేరువలో కరోనా కేసులు

భువనేశ్వర్‌ : ఒడిశా రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్నది. నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మంగళవారం 647 కేసులు నమోదుకాగా మహమ్మారి బారినపడి చికిత్స పొందుతున్న 457 మంది కొలుకొని డిశ్చార్జి అయ్యారని ఆ రాష్ట్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో మొత్తం 18,757 కరోనా కేసులు నమోదుకాగా 12,910 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 5714 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 103 మంది మృతి చెందినట్లు పేర్కొంది.

తాజావార్తలు


logo