ఆదివారం 05 జూలై 2020
National - Jun 15, 2020 , 19:03:31

ఒడిశాలో 23శాతం అధిక వర్షపాతం

ఒడిశాలో 23శాతం అధిక వర్షపాతం

భువనేశ్వర్‌ : ఒడిశా రాష్ట్రంలో ఈ ఏదాది జూన్‌ 1నుంచి 15వరకు  సాధారణం కంటే 23శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణశాఖ భువనేశ్వర్‌ డైరెక్టర్‌ బిశ్వాస్‌ సోమవారం తెలిపారు. సాధారణంగా ప్రతి ఏడాది జూన్‌ 1నుంచి 15వరకు 79.2మి.మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఈ సారి 97.4మి.మీటర్ల వర్షం కురిసిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా 10జిల్లాల్లో సాధారణ వర్షం పడిందని, మిగిలిన చోట్ల లోటు వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. 24గంటల వ్యవధిలో బార్గా జిల్లాలో అత్యధికంగా 125మి.మీటర్ల వర్షం కురిసిందని తెలిపారు. రుతుపవనాల ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో సముద్ర తీరప్రాంతాలతోపాటు పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిస్తున్నాయని పేర్కొన్నారు. ఉత్తర బెంగాళ్‌ తీరంలో అల్పపీడనం ఏర్పాడే అవకాశముందని, దీని ప్రభావంతో ఉత్తర ఒడిశాలో జూన్‌ 18నుంచి 19వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. 


logo