శనివారం 30 మే 2020
National - May 16, 2020 , 08:29:38

11వ తరగతి వరకు పరీక్షలు లేకుండా ప్రమోషన్‌

11వ తరగతి వరకు పరీక్షలు లేకుండా ప్రమోషన్‌

భువనేశ్వర్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్లు ఒడిశా సర్కార్‌ ప్రకటించింది. రాష్ట్రంలో 1 నుంచి 8వ తరగతి వరకు పాఠశాల విద్యలో భాగంగా ఉండగా, 9 నుంచి 11వ తరగతి వరకు బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఉన్నాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో సర్కార్‌ బడుల్లో చదువుతున్న విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేయాలని సీఎం నవీన్‌ పట్నాయక్‌ నేతృతంలోని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే తొమ్మిది, పదోతరగతికి సంబంధించిన పరీక్షలు జరుగుతున్నప్పుడే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. దీంతో కొన్ని సబ్జెక్టులకు పరీక్షలను నిర్వహించాల్సి ఉండగా, వాటిని రద్దు చేసింది. వాటికి సంబంధించి గతంలో నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.


logo