బుధవారం 03 జూన్ 2020
National - May 08, 2020 , 18:35:14

రూ. 30 ల‌క్ష‌ల విలువైన బ్రౌన్‌షుగ‌ర్ స్వాధీనం

రూ. 30 ల‌క్ష‌ల విలువైన బ్రౌన్‌షుగ‌ర్ స్వాధీనం

బాల‌సోర్‌: ఒడిశా రాష్ట్రంలోని బాల‌సోర్ జిల్లాలో రూ.30 ల‌క్ష‌ల విలువైన బౌన్‌షుగ‌ర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా - ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాల మ‌ధ్య ఉన్న ల‌క్స‌నాథ్ చెక్‌పోస్టు వ‌ద్ద పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించారు. ఒక పెద్ద సొర‌చేప‌ను తీసుకువెళుతున్న వ్య‌క్తిని అడ్డుకున్న‌ పోలీసులు అత‌డిని ప్ర‌శ్నించారు. నిందితుడు పారిపోయేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో అత‌డిని అదులోకి తీసుకుని, సొర‌చేప‌ను చీల్చి చూశారు. చేప లోంచి 10 గ్రాముల‌ బ్రౌన్‌షుగ‌ర్ బ‌య‌ట‌ప‌డింది. చేప‌లు తీసుకవెళుతున్న వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిషేధిత మాద‌క‌ద్ర‌వ్యం విలువ రూ.30 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు. 


logo