గురువారం 02 జూలై 2020
National - Jun 30, 2020 , 13:31:42

కూరగాయల తోటగా మారిన నాయగర్‌ సబ్‌జైలు

కూరగాయల తోటగా మారిన నాయగర్‌ సబ్‌జైలు

ఒడిశా : కొండలు, గుట్టలతో కూడిన విశాల ప్రాంతాన్ని కలిగి ఉన్న ఒడిశాలోని నాయగర్‌ సబ్ జైలులోని  కొంత భాగాన్ని కూరగాయాల తోటగా మార్చారు. ఖైదీలపై మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు వారి ఆదాయానికి ఉపాధిమార్గంగా ఉండి ఈ కూరగాయల తోట సాగు. వంకాయ, ఉల్లిగడ్డలు, పాలకూర, దోసకాయ, పసులు వంటి తదితర పంటలను ఇక్కడి ఖైదీలు పండిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు కూరగాయల అమ్మకం ద్వారా వచ్చిన రూ. లక్ష ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు జైలు అధికారులు జమచేశారు.

ఆదాయమే తమ లక్ష్యం కాదని ఖైదీలు ఏదో ఒక పనిలో నిమగ్నమవడం తమకు సంతోషాన్ని కలిగిస్తుందని జైలు సూపరింటెండెంట్‌ అన్నారు. జైలులోని ప్రతి ఒక్క వ్యక్తి వ్యక్తిగత అకౌంట్‌ను కలిగి ఉన్నాడని, సంసాదించే ప్రతిదీ వారి పాస్‌బుక్‌లో నమోదు అవుతుందని తెలిపారు. జైలు నుంచి విడుదలయ్యేనాటికి ప్రతిఒక్కరూ సొంతంగా పనిచేసుకుని బ్రతికే ఆత్మవిశ్వాసం వస్తుందన్నారు. అదేవిధంగా నూతన జీవితాన్ని ప్రారంభించేందుకు కొంత నగదు వారి చేతిలో ఉంటుందని పేర్కొన్నారు.


logo