శనివారం 04 జూలై 2020
National - Jun 18, 2020 , 12:46:10

7 రోజులపాటు టాయిలెట్‌లోనే క్వారెంటైన్‌

7 రోజులపాటు టాయిలెట్‌లోనే క్వారెంటైన్‌

ఉద్యోగం ప‌రంగా ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లిన వారు క‌రోనా వ్యాప్తి కార‌ణంగా తిరిగి స్వ‌స్థ‌లాల‌కు వ‌స్తున్నారు. అలాగే త‌మిళ‌నాడులో ఉద్యోగం చేస్తున్న 28 ఏండ్ల యువ‌కుడు మాన‌స్ ప‌త్రా త‌న సొంత ఊరు ఒడిశాకు తిరిగి వెళ్లాడు. ఒడిశాలోకి ఎంట‌ర్ కాగానే వారం రోజుల పాటు సుదుకాంతి పాఠ‌శాల‌లో ప్ర‌భుత్వం న‌డుపుతున్న తాత్కాలిక వైద్య శిబిరం క్వారెంటైన్‌‌లో ఉంచారు అధికారులు. క‌రోనా ల‌క్ష‌ణాలేమీ క‌నిపించ‌క‌పోవ‌డంతో ఏడు రోజుల‌కు డిశ్చార్జ్ చేశారు. ఆ త‌ర్వాత హోమ్ క్వారెంటైన్ మ‌రో వారం రోజులపాటు ఉండాల‌ని చెప్పారు.

6 మంది కుటుంబ స‌భ్యులున్నత‌న ఇంట్లో త‌గినంత స్ఠ‌లం లేదు. టిఎంసిలో త‌న బ‌స‌ను పొడిగించాల‌ని మాన‌స్ ప‌త్రా కోరాడు. పొడిగింపుకు అనుమ‌తి లేద‌ని అధికారి తెలిపారు. ఇంట్లో మ‌రొక గ‌ది లేక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యుల భ‌ద్ర‌త కోసం టాయిలెట్‌లో ఉండాల్సిన వ‌చ్చింద‌ని ప‌త్రా చెప్పుకొచ్చాడు. అతను కొత్తగా నిర్మించిన మరుగుదొడ్డిలోనే జూన్ 9 నుండి 15 వరకు ఏడు రోజులు గడిపాడు.


logo