సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 17:29:02

నాగిని సీరియ‌ల్ చూడ్డానికి వ‌చ్చిన రియ‌ల్ నాగిని!

నాగిని సీరియ‌ల్ చూడ్డానికి వ‌చ్చిన రియ‌ల్ నాగిని!

నాగుపాముని మ్యూజియంలో చూస్తేనే వ‌ళ్లు గ‌గుర‌పుడుతుంది. అలాంటిది ఇంట్లో చూస్తే ఇక ఆ ఇంట్లోకి కూడా వెళ్ల‌లేby. ఏం చేస్తాం అంత పెట్టుబ‌డి పెట్టి ఇల్లు క‌ట్టించుకున్నాక త‌ప్పుతుందా ఇంట్లోకి పామే కాదు, ఏం వ‌చ్చినా వాటిని త‌రిమికొట్టి వెళ్లాల్సిందే. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా సిమిలిగుడాలో ఎప్పుడు దూరిందో కాని పాము ఇంట్లో చొర‌బ‌డింది. జగన్నాథ నాయక్ అనే వ్యక్తి టీవీ స్విచ్ ఆన్‌ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఏదో వింత శబ్దం వినిపించింది.

దీంతో గదిలో లైట్‌ వేసి మళ్లీ టీవీ ఆన్ చేయడానికి వెళ్లాడు. టీవీ వెనుక నుంచి బుస బుస అని శబ్దం వస్తుండటంతో పరిశీలనగా చూశాడు. అంతే, అతడికి గుండె ఆగినంత పనైంది. ఏముంది పాము. కొంచెం ప్ర‌దేశంలోనే ఉంట చుట్టుకొని ఉంది. గ‌జ‌గ‌జవ‌ణుకుతూనే స్నేక్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేశాడు నాయ‌క్‌. సుజీత్ మహంతీ అనే వాలంటీర్ అక్కడికి చేరుకొని టీవీ వెనుక నక్కిన పామును జాగ్రత్తగా బయటకు తీసి సంచిలో బంధించాడు. ఆ పాము చాలా విషం క‌లిగిన‌ది. సుమారు 5 అడుగుల పొడ‌వు ఉంటుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. దీనిని చూసి 'నాగిని సీరియ‌ల్ చూడ్డానికి వ‌చ్చిందేమో' అంటూ నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. 


logo