భువనేశ్వర్: ఒడిశాలో వీధి కుక్కను చంపిన ఓ వ్యక్తి జైలుపాలయ్యాడు. రాష్ట్రంలోని కేంద్రపార జిల్లాకు చెందిన బాబులా సింగ్ అనే వృద్ధుడు తన ఇంటి వద్ద కోళ్లను పెంచుకుంటున్నాడు. అయితే అందులో రెండు కోళ్లను ఓ వీధి చంపేసింది. దీంతో అతడు ఆ శునకాన్ని చనిపోయేదాకా కొట్టాడు. అది కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ నేపథ్యంలో అతనిపై పోలీసులు అతనిపై కేసు నమోదుచేశాడు. విచారణ సందర్భంగా తన కోళ్లను చంపినందుకే దానిని కొట్టానని తెలిపాడు. ఈనేపథ్యంలో పోలీసులు ఐపీసీ సెక్షన్ 429 ప్రకారం అతనిపై కేసు నమోదుచేశారు. దీంతో అతనికి జిల్లా కోర్టు జైలు శిక్ష విధించింది.