ఆదివారం 29 మార్చి 2020
National - Mar 24, 2020 , 13:45:45

ఒడిశాలో మార్చి 29 వ‌ర‌కు లాక్ డౌన్‌

ఒడిశాలో మార్చి 29 వ‌ర‌కు లాక్ డౌన్‌

భువ‌నేశ్వ‌ర్: ప‌్ర‌పంచ దేశాల‌ను క‌రోనా వైర‌స్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. మ‌న దేశంలోనూ వైర‌స్ వేగంగా విస్త‌రిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్‌ విధించాయి. తాజాగా  ఒడిశా సైతం లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది. మార్చి 24 నుంచి 29 వ‌ర‌కు ఈ లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఒడిశా ప్ర‌భుత్వ అధికార ప్ర‌తినిధి సుబ్ర‌తో బాగ్చీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

ఒడిశా స‌ర్కారు ఇటీవ‌ల ఐదు జిల్లాల్లో లాక్‌డౌన్ విధించింది. అయితే దేశంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండ‌టంతో.. లాక్‌డౌన్ ను ఐదు జిల్లాల నుంచి 14 జిల్లాల‌కు విస్త‌రిస్తున్న‌ట్లు సోమ‌వారం ఉద‌యం ప్ర‌క‌టించింది. అయితే ఇప్ప‌టికే అన్ని రాష్ట్రాలు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించ‌డాన్ని గ‌మ‌నించిన న‌వీన్ ప‌ట్నాయ‌క్ స‌ర్కారు.. మంగ‌ళ‌వారం నుంచి ఒడిశాలో సైతం పూర్తిస్థాయి (మొత్తం 30 జిల్లాల్లో) లాక్‌డౌన్ విధించింది. అదేవిధంగా ఎవ‌రైతే క‌రోనా అనుమానితులుగా హోమ్ క్వారైంటైన్ లో ఉన్నారో వారి ఇంటి త‌లుపుల‌కు స్టిక్క‌ర్లు వేయాల‌ని కూడా ఒడిశా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.  


logo