ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 16:12:20

ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం

ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం

భువనేశ్వర్: ఒడిశా ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా నేపథ్యంలో విధి నిర్వహణలో వైరస్ బారినపడి చనిపోయిన అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చింది. వారి 60 ఏండ్ల సర్వీసు కాలం వరకు బాధిత కుటుంబాలకు సంబంధిత వేతనాన్ని ఇస్తామని చెప్పింది. అంగన్‌వాడీ కార్యకర్తల బాధిత కుటుంబాలకు నెలకు రూ.7,500 చొప్పున, ఆశా కార్యకర్తల బాధిత కుటుంబాలకు నెలకు రూ.5,000 చొప్పున చెల్లిస్తామని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ఉత్తర్వును ఒడిశా ప్రభుత్వం విడుదల చేసింది.
logo