మంగళవారం 14 జూలై 2020
National - Jun 29, 2020 , 15:10:12

క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్న వారికి రూ.2,000

క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్న వారికి రూ.2,000

భువనేశ్వర్‌: కరోనా నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్న వారికి రూ.2,000 నగదు చెల్లిస్తున్నది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కార్మికులు ప్రత్యేక శ్రామిక్‌ రైళ్లలో సొంత రాష్ట్రాలకు చేరుతున్నారు. అయితే కొందరు క్వారంటైన్‌ నిబంధనలను పాటించడం లేదు. దీంతో పలు రాష్ట్రాల్లో ఇటీవల కరోనా కేసుల సంఖ్య బాగా పెరుగుతున్నది. 

ఈ నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని అమలు చేస్తున్నది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్నవారి బ్యాంకు ఖాతాల్లో రూ.2,000 జమ చేస్తున్నది. ఇటీవల ఓ వ్యక్తి జాజ్‌పూర్‌లోని క్వారంటైన్‌ కేంద్రంలో పది రోజులపాటు ఉన్నాడు. అనంతరం అక్కడి నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు తన బ్యాంకు ఖాతాలో రూ.2,000ను ప్రభుత్వం జమ చేసినట్లు అతడు తెలిపాడు. కార్వంటైన్‌ కేంద్రంలో ఉన్నన్ని రోజులు తాను ఉపాధి కోల్పోయానని, ప్రభుత్వం ఇచ్చిన ఈ డబ్బులు కొంత మేర సహాయంగా ఉంటాయని అతడు పేర్కొన్నాడు. 


logo