బుధవారం 02 డిసెంబర్ 2020
National - Oct 31, 2020 , 12:34:00

ఒడిశాలో న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు లాక్‌డౌన్‌!

ఒడిశాలో న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు లాక్‌డౌన్‌!

భువ‌నేశ్వ‌ర్‌: క‌రోనా పాజిటివ్ కేసుల విస్త‌ర‌ణ ఇంకా కొన‌సాగుతుండ‌టంతో లాక్‌డౌన్ గ‌డువును మ‌రింత పొడిగించాల‌ని ఒడిశా స‌ర్కారు నిర్ణ‌యించింది. ఈ మేర‌కు న‌వంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. రాష్ట్రంలోని అన్ని కంటైన్‌మెంట్ జోన్‌ల‌కు ఈ లాక్‌డౌన్ పొడిగింపు వ‌ర్తిస్తుంద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అదేవిధంగా న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు రాష్ట్రంలోని అన్ని ర‌కాల విద్యాసంస్థ‌లను మూసే ఉంచాల‌ని ఒడిశా ప్ర‌భుత్వం ఆదేశించింది. అయితే, 9 నుంచి 12వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు మాత్రం న‌వంబ‌ర్ 16 నుంచి ఆయా పాఠ‌శాల‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో త‌ర‌గ‌తులు నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టంచేసింది.       

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.