గురువారం 02 జూలై 2020
National - Apr 06, 2020 , 13:16:43

సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌క‌పోతే క్రిమిన‌ల్ చ‌ర్య‌లు: ఒడిశా సీఎం

సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌క‌పోతే క్రిమిన‌ల్ చ‌ర్య‌లు: ఒడిశా సీఎం

భువ‌నేశ్వ‌ర్: ఒడిశాలో గ‌త కొన్ని రోజులుగా క‌రోనా కేసులు మెల్ల‌మెల్ల‌గా విస్త‌రించాయి. కానీ ఆదివారం ఒక్క‌రోజే కొత్తగా 18 కేసులు నమోదవ‌డంతో మొత్తం కేసుల సంఖ్య 39కి చేరింది. దీంతో ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను అప్ర‌మత్తం చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ క‌చ్చితంగా సామాజిక దూరం పాటించాల‌ని, లేదంటే క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయ‌న హెచ్చ‌రించారు. కరోనావైరస్ పై పోరాటానికి ప్ర‌జ‌లంతా స‌హ‌క‌రించాల‌ని ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు. ఎక్కువ కేసులు రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్‌లోనే న‌మోద‌య్యాయ‌న్న ఆయ‌న‌.. ప్రజలు భయపడవద్దని కోరారు. అయితే లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే మాత్రం పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటార‌ని న‌వీన్ ప‌ట్నాయ‌క్ హెచ్చ‌రించారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo