బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 03:48:58

రూ.3.5 లక్షల బంగారం మాస్క్‌

రూ.3.5 లక్షల బంగారం మాస్క్‌

భువనేశ్వర్‌: కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలంటే మాస్క్‌ ధరించడం తప్పనిసరి. అయితే బంగారం మీద మమకారం ఉన్న ఒడిశాలోని కటక్‌కు చెందిన వ్యాపారి అలోక్‌ మొహంతి రూ.3.5 లక్షలు ఖర్చుపెట్టి బంగారం మాస్క్‌ తయారు చేయించుకున్నారు. మహారాష్ట్రలో ఓ వ్యక్తి బంగారం మాస్క్‌ ధరించిన విషయాన్ని టీవీలో చూశానని, దీంతో తాను కూడా అలాంటి మాస్క్‌ తయారు చేయించుకున్నానని అలోక్‌ మొహంతి చెప్పారు.logo