గురువారం 28 జనవరి 2021
National - Dec 31, 2020 , 01:52:03

ఒడియా సంగీత దిగ్గజం శంతను మహాపాత్ర కన్నుమూత

ఒడియా సంగీత దిగ్గజం శంతను మహాపాత్ర కన్నుమూత

భువనేశ్వర్‌: ఒడియా సంగీత దిగ్గజం శంతను మహాపాత్ర (84) కన్నుమూశారు. నిమోనియాతోపాటు ఇతర వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. శంతను మృతిపట్ల ఒడిశా గవర్నర్‌ గణేశ్‌ లాల్‌, ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంగీత రంగానికి మహాపాత్ర దాదాపు ఆరు దశాబ్దాల పాటు సేవలు అందించారు. ఒడియాలో ‘కోణార్క్‌ గాథ’ పేరిట తొలి ఆధునిక జానపద గేయగాథను రూపొందించారు. 


logo