శుక్రవారం 03 జూలై 2020
National - Apr 13, 2020 , 13:01:57

కూరగాయల వ్యాపారులకూ సరి-బేసి విధానం

కూరగాయల వ్యాపారులకూ సరి-బేసి విధానం

హైదరాబాద్: ఢిల్లీలో మొన్నటిదాకా వాహనాల కాలుష్యం తగ్గించేందుకు సరి-బేసి విధానం ప్రవేశపెట్టినట్టుగానే ఇప్పుడు కరోనా వ్యాప్తి నిరోధానికి కూరగాయల మార్కెట్‌లోనూ అదే విధానాన్ని అమలుచేస్తున్నారు. ఢిల్లీ అభివృద్ధి శాఖామంత్రి గోపాల్ రాయ్ సోమవారం హోల్‌సేల్ మార్కెట్ల అధికారుల సమావేశం నిర్వహించారు. ఇక నుంచి కూరగాయల వ్యాపారులు ప్రత్యామ్నాయ దినాలలో మాత్రమే మార్కెట్‌కు వస్తారని ఆయన చెప్పారు. అంతేకాకుండా కూరగాయలు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, పండ్లు 2 నుంచి 6 గంటల వరకు అమ్ముతారని తెలిపారు. మార్కెట్లలో సామాజిక దూరం పాటించేందుకు నాలుగు స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ప్రధానమైన ఆజాద్‌పూర్, కేశోపూర్, నజఫ్‌గఢ్, మెహరోలీ మార్కెట్ల ఏర్పాట్లలో అనేక మార్పులు చేశారు. మొదటి రెండింటిలో దఫాలవారీ అమ్మకాలు ప్రవేశపెట్టారు. మిగిలిన రెండింటిని సమీపంలోని విశాలమైన ప్రాంగణాలకు మార్చారు.


logo