శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 24, 2020 , 13:12:37

'ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు తప్పకుండా పాటించాలి'

'ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు తప్పకుండా పాటించాలి'

ఢిల్లీ: కరోనా పాజిటివ్‌ కేసులు దేశవ్యాప్తంగా 492 నమోదయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కరోనాతో ప్రపంచం అల్లాడుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు తప్పకుండా పాటించాలని, కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని కోరారు. కరోనా బాధితులు 37 మందిని డిశ్చార్జి చేశామన్నారు. 436 మందిని ఇండ్లలోనే ఉంచి చికిత్స చేయిస్తున్నామని తెలిపారు. విమానాశ్రాయాల్లో సుమారు 15.24 లక్షల మందికి స్క్రీనింగ్‌ చేయించామని, 107 ఇమ్మిగ్రేషన్‌ కేంద్రాలను పూర్తిగా మూసివేస్తున్నామని వెల్లడించారు.   


logo