శుక్రవారం 27 నవంబర్ 2020
National - Oct 24, 2020 , 19:01:17

దుర్గా పూజలకు హాజరైన ఎంపీ నుస్రత్ జహాన్

దుర్గా పూజలకు హాజరైన ఎంపీ నుస్రత్ జహాన్

కోల్‌కతా : దుర్గా పూజను కోల్‌కతాలో చాలా ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ దక్షిణ కోల్‌కతాలోని పూజ పండల్‌ను సందర్శించి పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆమె భర్త నిఖిల్ జైన్ సాంప్రదాయ డ్రమ్స్ వాయించగా.. నుస్రత్ జహాన్ ఢాక్  నృత్యం చేసి అలరించారు. హిందువులకు సంబంధించిన అన్ని పండుగలను ఘనంగా జరుపుకుంటూ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. 

శనివారం దక్షిణ కోల్‌కతాలో ఉన్న దుర్గామాతా పండల్‌కు వచ్చారు. పండల్ ఇంచార్జీ నుస్రత్ జహాన్ దంపతులను సాదరంగా ఆహ్వానించి వారితో ప్రత్యేక పూజలు జరిపించారు. ఎంపీ రాక సందర్భంగా స్థానిక యువత డ్రమ్స్ వాయిస్తూ డ్యాన్సులు చేయగా.. నుస్రత్ కూడా వారితో పాదం కలిపారు. ఆమె భర్త నిఖిల్ జైన్ కొద్దిసేపు డ్రమ్స్ వాయించారు. దీంతో పండల్ లో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొన్నది. పండల్ లో ఉన్నవారందరూ ముఖాలకు మాస్కులు ధరించారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రభుత్వం ఆదేశించిన నిర్ణీత దూర నిబంధనలకు కట్టుబడి ఉంటున్నారు. సినిమా కథానాయకి నుంచి రాజకీయ నాయకురాలుగా ఎదిగిన నుస్రత్ జహన్.. బసిర్ హాట్ నియోజకవర్గం నుంచి టీఎంసీ ఎంపీగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆమె తన నియోజకవర్గంలో మొత్తం ఓట్లలో 54.6 శాతం ఓట్లు సాధించి బీజేపీకి చెందిన సయంతన్ ఘోష్‌ను ఓడించారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.