శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 12:22:14

ఉద్యోగం నుంచి తొలగింపుపై కాంట్రాక్టు నర్సుల నిరసన

ఉద్యోగం నుంచి తొలగింపుపై కాంట్రాక్టు నర్సుల నిరసన

న్యూఢిల్లీ: ఉద్యోగం నుంచి తొలగింపుపై కాంట్రాక్టు నర్సులు నిరసనకు దిగారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమను తొలగించడంపై వారు మండిపడ్డారు. ఢిల్లీలోని జనక్‌పురి సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న 40 మంది కాంట్రాక్టు నర్సులను ఉన్నపళంగా ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో ఆ దవాఖాన ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఫ్లకార్డులు ప్రదర్శించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను ఉద్యోగం నుంచి తొలగింపుపై అధికారులు ఎలాంటి కారణం చెప్పలేదని నర్సులు ఆరోపించారు. కరోనా రోగులకు వైద్య సేవలందించిన తమపట్ల ప్రభుత్వం ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. తమ ఉద్యోగాలు తమకు తిరిగి ఇవ్వాలని 40 మంది కాంట్రాక్టు నర్సులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
logo