శుక్రవారం 05 జూన్ 2020
National - May 12, 2020 , 15:59:32

క‌రోనా క‌ట్ట‌డిలో న‌ర్సుల కృషి ఎంతో గొప్ప‌ది: ప‌్ర‌ధాని

క‌రోనా క‌ట్ట‌డిలో న‌ర్సుల కృషి ఎంతో గొప్ప‌ది: ప‌్ర‌ధాని

న్యూఢిల్లీ: క‌రోనా క‌ట్ట‌డిలో న‌ర్సుల కృషి ఎంతో గొప్ప‌దని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ కొనియాడారు. క‌రోనాను పార‌దోలేందుకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌ర్సులు చేస్తున్న అసాధార‌ణ కృషికి అంద‌రం ధ‌న్య‌వాదాలు తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని, నేడు (మే 12) అంత‌ర్జాతీయ  న‌ర్సుల దినోత్స‌వం సంద‌ర్భంగా వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుదామ‌ని ప్ర‌ధాని ట్వీట్ చేశారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో మ‌న న‌ర్సింగ్ సిబ్బంది ఆపార‌మైన జాలి, ద‌య‌, ప్రేమ భావం క‌లిగి ఉన్నార‌ని ప్ర‌ధాని ప్ర‌శంసించారు. న‌ర్సుల సంక్షేమం కోసం కృషిచేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా మ‌నంద‌రం పున‌రుద్ఘాటించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆధునిక న‌ర్సిగ్ వ్య‌వ‌స్థ వ్య‌వ‌స్థాప‌కురాలు, సంఘ సంస్క‌ర్త ఫ్లోరెన్స్ నైటింగేల్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ప్ర‌తి ఏటా మే 12న అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం జ‌రుపుకుంటున్నాం.   

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo