సోమవారం 13 జూలై 2020
National - Jun 21, 2020 , 21:42:09

‘కేజీఎంయూ’లో నర్సుకు కరోనా పాజిటివ్‌

‘కేజీఎంయూ’లో నర్సుకు కరోనా పాజిటివ్‌

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీ కార్డియాలాజీ ఐసీయూ విభాగంలో పని చేసే ఓ నర్సుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆసుపత్రి వర్గాలు ఆమెను అదే హాస్పిటల్‌లోని ఐసోలేషన్‌ వార్డులో క్వారంటైన్‌లో ఉంచారు. గడిచిన 24గంటల్లో ఆ రాష్ట్రవ్యాప్తంగా 596 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 6,186 యాక్టివ్‌ కేసులున్నాయని, 10,995మంది చికిత్సకు కోలుకోగా.. 55మంది మృతి చెందారని ఆ రాష్ట్ర హెల్త్‌ సెక్రెటరీ అమిత్‌ మోహన్‌ తెలిపారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 16,125శ్యాంపిళ్లను పరీక్షించామని, పరీక్షలను మరింత పెంచుతామని వెల్లడించారు. లక్నో, కాన్పూర్‌, వరాని, గోరఖ్‌పూర్‌ తదితర జిల్లాలో యాంటి టెస్టుల నిర్వహణకు ఐసీఎంఆర్‌ అనుమతించిందని, త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు.


logo