శనివారం 04 జూలై 2020
National - May 25, 2020 , 21:39:03

10వ అంతస్తు నుంచి దూకి నర్సు ఆత్మహత్య

10వ అంతస్తు నుంచి దూకి నర్సు ఆత్మహత్య

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. నగరంలోని సివిల్‌ ఆస్పత్రిలో పనిచేసే ఒక నర్సు ఆత్మహత్యకు పాల్పడింది. న్యూ మనీనగర్‌లో తన పేరెంట్స్‌ నివాసం ఉండే భవనం 10వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వివాహిత అయిన 28 ఏండ్ల నర్సు కొన్ని రోజుల క్రితమే తల్లిగారింటికి వచ్చింది. ఇంతలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. 

మృతురాలు తన భర్తతో కలిసి అహ్మదాబాద్‌లోని సీటీఎమ్ ఏరియాలో ఉండేదని, కొద్ది రోజుల క్రితమే తల్లిగారింటి వచ్చిన ఆమె ఇప్పుడు ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. కాగా, తమ కూతురు గత రెండు మూడు రోజులుగా తీవ్ర ఒత్తిడిలో కనిపించిందని, కానీ ఇంత పని చేస్తుందని ఊహించలేదని మృతురాలి తల్లిదండ్రులు విలపించారు.


logo