శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 20, 2020 , 19:17:20

పశ్చిమ బెంగాల్‌లో పెరిగిన ఎంబీబీఎస్‌ సీట్లు

పశ్చిమ బెంగాల్‌లో పెరిగిన ఎంబీబీఎస్‌ సీట్లు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్యను 4 వేలకు పెంచుతున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండు వైద్య కళాశాలకు అదనంగా 250 సీట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. సోమవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రాష్ట్రంలో మెడికల్‌ సీట్ల సంఖ్య పెంపునకు గల అవసరాన్ని నొక్కి చెప్పారు.

రాష్ట్రంలో 4 వేల ఎంబీబీఎస్‌ ఉన్నాయని చెప్పేందుకు సంతోషిస్తున్న. బెంగాల్‌కు శక్తివంతమైన వైద్య విద్యార్థులను అందించేలా మొదటి ఎంబీబీఎస్‌ బ్యాచ్ ప్రారంభానికి పురులియా ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు 100 సీట్లు, గౌరీదేవి మెడికల్‌ కళాశాలకు అదనంగా మరో 150 సీట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు. 2011లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో  1,355 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి చంద్రిమ బట్టాచార్య గతేడాది అసెంబ్లీలో ప్రకటించారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.