సోమవారం 30 నవంబర్ 2020
National - Sep 25, 2020 , 01:09:25

కరోనాతో అణుశాస్త్రవేత్త శేఖర్‌ బసు కన్నుమూత

కరోనాతో అణుశాస్త్రవేత్త శేఖర్‌ బసు కన్నుమూత

కోల్‌కతా: ప్రముఖ అణు శాస్త్రవేత్త, అణుశక్తిసంఘం మాజీ చైర్మన్‌, పద్మశ్రీ డాక్టర్‌ శేఖర్‌ బసు (68) కరోనా కారణంగా గురువారం కన్నుమూశారు. శేఖర్‌ బసు దేశ తొలి అణుజలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌కు అవసరమైన అణురియాక్టర్‌ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. 2014లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో ఆయనను గౌరవించింది. డాక్టర్‌ శేఖర్‌బసు మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.